Raithu Nestham Natural Products | రైతు నేస్తం సేంద్రియ ఉత్పత్తులు
బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనెలు, పండ్లు… ! ఇలా నేడు మనం తినే ఆహార ఉత్పత్తుల్లో అనేక రసాయనాలు. అందుకే ఇన్ని రోగాలు. ఇలా ఆహారమే ఆవేదనలను మోసుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందు ఉన్న ప్రత్యామ్నాయం…. సేంద్రీయ పంట ఉత్పత్తులే. ఈ నేపథ్యంలోనే … నాణ్యమైన సేంద్రీయ ఉత్పత్తులను ప్రజలకు అందించాలని సంకల్పించింది… రైతు నేస్తం. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు శివారు కొర్నెపాడులోని రైతు నేస్తం ఫౌండేషన్ ఆవరణలో… మరియు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్ ఆవరణలో…. నేచురల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రాలను ప్రారంభించింది. అందుబాటు ధరలలో నాణ్యమైన సేంద్రీయ ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రైతు నేస్తం నేచురుల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రంలో రోజూ వారి వినియోగానికి అవసరమయ్యే అన్ని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బియ్యం, గోధుమలు, గోధుమ పిండి, జొన్నలు, సజ్జలు, పసుపు, కొర్రలు, సామలు, రాగులు, రాగిపిండి, చిరు ధాన్యాల పిండి, కొర్ర పిండి, జొన్న పిండి లభిస్తుంది. అలాగే… కంది పప్పు, మినపప్పు, కారం, వేరు శనగపప్పు, బెల్లం, బెల్లంపొడి, పెసలు, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి వంటి ఆహార పదార్థాలు అందుబాటు ధరలో ఉన్నాయి.
రైతు నేస్తం నేచురల్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్ర చిరునామా…. డోర్ నెంబర్ 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, షాదన్ కాలేజ్ దగ్గర, హైదరాబాద్ – 500004. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 040 – 23395979, 9963978757.
గుంటూరులోని రైతు నేస్తం నేచురల్ ప్రొడక్ట్స్ చిరునామా – డోర్ నెంబర్ 8 – 201, మెయిన్ రోడ్, కొర్నెపాడు పోస్ట్, వట్టి చెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 0863 – 2286255, 9949881564